Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Sharonu Vanamulo Pusina Pushpamai Loya

షారోను వనములో పూసిన పుష్పమై లోయ

Sharonu Vanamulo Pusina Pushpamai Loya

Verse 1
షారోను వనములో పూసిన పుష్పమై
లోయలలో పుట్టిన వల్లిపద్మమునై
నీ ప్రేమాతిశయమునే నిత్యము కిర్తుంచుచు
ఆనందమయమై నన్నె మరిచితిని
Verse
సుకుమారమైన వదనము నీది - స్పటికము వలె చల్లనైన హృదయము నీది
మధురమైన నీ మాతల సవ్వడి వినగా - నిన్ను చుడ ఆశలెన్నొ మనసు నిండెనె
ప్రభువా నిను చెరనా‖ షారోను ‖
Verse
సర్వొన్నతమైన రాజ్యము నీది - సొగసైన సంబరాల నగరము నీది
న్యాయమైన నీ పాలన విధులను చూడగా - నిన్ను చేర జనసంద్రము ఆశ చెందునే
ప్రభువా నిన్ను మరతునా‖ షారోను ‖
Verse
సాత్వికమైన పరిచర్యలు నీవి - సూర్యకాంతిమయమైన వరములు నీవి
పరిమలించు పుష్పమునై చూపనా - ప్రీతి పాత్రనై భువిలో నిన్నే చాటనా
ప్రభువా కృపతో నింపుమా‖ షారోను ‖

Related Tags

WorshipDevotional