Intro
ప్రేమ శాశ్వత కాలముండును 1 కొరింథీ. 13:8
Chorus
శాశ్వతమైనది ప్రేమ - యెహోవా తండ్రి ప్రేమ
Pre-Chorus
ప్రేమలో భయమేమియు లేదు - ప్రేమ పరిపూర్ణంబైయున్న
భయమును - పారగద్రోలున్
Verse
దీర్ఘకాలము ప్రేమ - దయచూపి సహించును
మత్సరపడదీ యుత్తమ ప్రేమ
డంబముగా నడువనిదీ ప్రేమ - ఉప్పొంగనిదీ ప్రేమ
Verse
స్వప్రయోజనమును - ఎప్పుడు కోరనిదీ ప్రేమ
అమర్యాదగ నడువని ప్రేమ
త్వరగా కోపపడని ప్రేమ - తలచదు అపకారమును
Verse
దుర్నీతిలో గాక - సత్యాన సంతోషించున్
అన్నిటిని తాళుకొను ప్రేమ
అన్నిటినమ్మియోర్చెడి ప్రేమ - అన్నిటి నిరీక్షించున్
Verse
నిలుచును విశ్వాసము - నిరీక్షణయు మరి ప్రేమ
వీటిలో శ్రేష్టమైనది ప్రేమ
ప్రేమను కల్గియుండుటకు - ప్రయత్నించుడి మీరు
Verse
ప్రేమలేనివాడు - దేవుని ఎరుగనివాడు
మన దేవుడు ప్రేమస్వరూపి
తన ప్రేమ మనలో సంపూర్ణ - సిద్ధిని పొందవలయు
Verse
నిన్నడుగుచున్నాడు - నిను ప్రేమించిన ప్రభుయేసు
నన్ను ప్రేమించుచున్నవా?
వీరికంటె నా పై నీకు - ఎక్కువ ప్రేమగలదా?
Verse
నను ప్రేమించినయెడల - నాయాజ్ఞలను గైకొనుము
మీలో మీరు ఒకరినొకరు
ప్రేమించుకొనుచున్న ఎడల - అదియే మహాదానందం