Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Shatha Koti Raagaalu

శత కోటి రాగాలు

Shatha Koti Raagaalu

Verse
శత కోటి రాగాలు వల్లించిన
నా యేసుకే నేను స్తుతి పాడనా
దినమెల్ల ప్రభు సాక్ష్యమే చాటగా
ఈ నూతన వత్సరాన అడుగు పెట్టిన – ఆనందించనా
హ్యాపీ న్యూ ఇయర్‖ 2x ‖
మై విషెస్ టు ఆల్ హియర్‖ 2x ‖
నా కంటి పాపై నా ఇంటి వెలుగై
నన్నాదరించాడు నా యేసుడే
నా మంచి కోరి నా మేలు కోరి
నను పెంచుతున్నాడు నా యేసుడే
నా వల్ల ప్రభుకేమి ఒరిగేది లేదు‖ 2x ‖
అయినా నను ప్రేమిస్తాడు
కన్న తల్లిలా నను లాలిస్తాడు‖ హ్యాపీ ‖
నా ఆశ తానై – నా శ్వాస తానై
నన్ను నడుపుతున్నాడు నా యేసుడే
నాలోన యుక్తయి – నాలోన బలమై
నను దరికి చేర్చాడు నా యేసుడే
ఏమైనా నేనేమి ప్రభుకివ్వగలను‖ 2x ‖
వరదలా దీవిస్తాడు
కన్న తండ్రిలా నను మెప్పిస్తాడు‖ హ్యాపీ ‖

Related Tags

PraiseThanksgivingNew Year