Chorus
ఓహో...ఓహో...ఓహో...ఓహో...‖ 4x ‖
శీతాకాలంలో క్రిస్ట్మస్ కాంతులతో
జనియించిన శ్రీ యేసుని నీడలో‖ 2x ‖
చీకు లేదు చింతా లేదు చాలా సంతోషం
బాధాలేదు భయము లేదు భలే ఆనందం‖ 2x ‖
హ్యాపీ క్రిస్ట్మస్ మెర్రీ క్రిస్ట్మస్‖ 2x శీతాకాలంలో ‖
Verse
యాకోబులో నక్షత్రం ఉదయించెను
తూర్పుదేశ జ్ఞానులు గుర్తించెను‖ 2x ‖
బెత్లెహేములో యేసుని చూచి
కానుకలిచ్చెను నాడు
ఆరాధించి ఆనందించి‖ 2x ‖
యేసుని చాటెనుచూడు
హ్యాపీ క్రిస్ట్మస్ మెర్రీ క్రిస్ట్మస్‖ 2x శీతాకాలంలో ‖
Verse
పొలమందు కాపరులకు దూత చెప్పెను
రక్షకుడు మీకొరకు పుట్టియున్నాడు‖ 2x ‖
పశువుల తొట్టిలో ప్రభువును చూచి
పరవశమొందిరి వారు
కని విన్నవాటిని ప్రచురము చేసి‖ 2x ‖
మహిమ పరచెను చూడు
హ్యపీ క్రిస్ట్మస్ మెర్రీ క్రిస్ట్మస్‖ 2x శీతాకాలంలో ‖