Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Shilanaina Nannu Shilpivai Maarchaavu

శిలనైన నన్ను శిల్పివై మార్చావు

Shilanaina Nannu Shilpivai Maarchaavu

Verse
శిలనైన నన్ను శిల్పివై మార్చావు
నాలోని ఆశలు విస్తరింపచేసావు‖ 2x ‖
నీ ప్రేమ నాపై కుమ్మరించుచున్నావు‖ 2x ‖
నీ ప్రేమే నా ఊపిరి – నీ ప్రేమే నా కాపరి‖ 2x శిలనైన ‖
Verse
మోడుబారిన నా జీవితం
నీ ప్రేమతోనే చిగురింపచేసావు‖ 2x ‖
నీ ప్రేమాభిషేకం నా జీవిత గమ్యం‖ 2x ‖
వర్ణించలేను లెక్కించలేను‖ 2x ‖
నీ ప్రేమే నా ఊపిరి – నీ ప్రేమే నా కాపరి‖ 2x శిలనైన ‖
Verse
ఏ విలువలేని అభాగ్యుడను నేను
నీ ప్రేమచూపి విలువనిచ్చి కొన్నావు‖ 2x ‖
నాయెడల నీకున్న తలంపులు విస్తారం‖ 2x ‖
నీ కొరకే నేను జీవింతు ఇలలో‖ 2x ‖
నీ ప్రేమే నా ఊపిరి – నీ ప్రేమే నా కాపరి‖ 2x శిలనైన ‖
Verse
ఊహించలేను నీ ప్రేమ మధురం
నా ప్రేమ మూర్తి నీకే నా వందనం‖ 2x ‖
నీ ప్రేమే నాకాధారం – నా జీవిత లక్ష్యం‖ 2x ‖
నీ ప్రేమే నా ఊపిరి – నీ ప్రేమే నా కాపరి‖ 2x శిలనైన ‖

Related Tags

DevotionalGraceTransformation