Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Shiramu Meeda Mulla Saakshigaa

శిరము మీద ముళ్ల సాక్షిగా

Shiramu Meeda Mulla Saakshigaa

Verse
శిరము మీద ముళ్ల సాక్షిగా
కార్చిన కన్నీళ్ల సాక్షిగా
పొందిన గాయాల సాక్షిగా
చిందిన రుధిరంబు సాక్షిగా‖ 2x ‖
యేసు నిన్ను పిలచుచున్నాడు
నీ కొరకే నిలచియున్నాడు‖ 3x ‖
Verse
సర్వ పాప పరిహారం కోసం
రక్త ప్రోక్షణం అవశ్యమని‖ 2x ‖
మనుషులలో ఎవ్వరు బలికి పనికిరారని
పరమాత్ముడే బలియై తిరిగి లేవాలని
ఆర్య ఋషులు పలికిన ఆ వేదం సత్యం
యేసులోనే నెరవేరెనుగా
Verse
సర్వ పాప పరిహారో
రక్త ప్రోక్షణం అవశ్యం
తద్ రక్తం పరమాత్మేనా
పుణ్య దాన బలియాగం
Verse
ఆర్య ఋషులు పలికిన ఆ వేద సత్యం
క్రీస్తులోనే నెరవేరెనుగా
యేసే బలియైన పరమాత్మ‖ శిరము ‖
Verse
మహా దేవుడే ఇలకేతెంచి
యజ్ఞ పశువుగా వధ పొందాలని‖ 2x ‖
కాళ్లలోన చేతులలో మూడు మేకులుండాలని
శిరముపైన ఏడు ముళ్ల గాయాలు పొందాలని
బ్రాహ్మణాలు పలికిన ఆ వేద సత్యం
క్రీస్తులోనే నెరవేరెనుగా
Verse
చత్వారః శ్రీద్న త్రయో అస్య పాదాద్రి
శీర్ష్యే సప్త హస్తాసో అస్య త్రిదావద్ధో
వృషభో రోర వీతి మహో దేవో
మద్యామ్ ఆవివేశత్తిథి
Verse
బ్రాహ్మణాలు పలికిన వేదోక్తి
యేసులోనే నెరవేరెనుగా
యేసే మరణించి లేచిన యజ్ఞ పురుషుడుగా‖ శిరము ‖

Related Tags

SalvationGood FridaySacrifice