Verse
శోధనకు మీరు
చోటియకుఁడి
ధైర్యము వహించి
పోరాటమును
సాధించెడు వారు
జయించెదరు
సాతానుకు లొంగఁ
బాపం బగును.
యేసు శక్తిని గోరి‖ యేసు శక్తిని ‖
యెల్లకాలము వేఁడుఁ
డేసుఁ డాశతో మిమ్ము
డాసి నడుపును
Verse
దుర్భుద్ధి కుభాష
మానుండు సదా
పాపాత్ముల పొందు
తప్పించుకొని
శ్రీ దేవుని పేరున్
దూషింపకయు
శ్లాఘించుచు మీరు
వర్ధిల్లుఁ డిలన్
Verse
జయించెడువారు
సౌందర్య ప్రభన్
చారు మకుటంబు
ధరించెదరు
ప్రభుండగు యేసు
నిక్కంబు నమ్ముఁ
డాయనె నిత్యంబు
సాయము నిచ్చున్