Verse
శూన్యమై ఉన్న నన్ను – నూటికి నూరుపాలు చేసి
యోగ్యునిగా నన్ను పిలిచినది – నీదు కృపయే కదా
ఎన్నిక లేని నన్ను – ఎన్నుకున్నది నీ కృపయే
Chorus
కృపయే కృపయే కృపయే యేసయ్య అంతా నీ కృపయే
Verse
నా జీవితం సాగుతున్నది – నా బలముతో కాదు
నే మట్టిలో ఉండక ఊపిరితో ఉన్నది- నా సామర్థ్యం కానే కాదు
ఎన్నిక లేని నన్ను – ఎన్నుకున్నది నీ కృపయే
Chorus
కృపయే కృపయే కృపయే యేసయ్య అంతా నీ కృపయే
Verse
నా కుటుంబం నెమ్మదితో ఉన్నది – నా ఐశ్వర్యముతో కాదు
నే ఎక్కలేనంత శిఖరముపై ఎక్కినది – నా జ్ఞానముతో కాదు
నా కుటుంబం నెమ్మదితో ఉన్నది – నా ధనముతో కాదు
నే ఎక్కలేనంత శిఖరముపై ఎక్కినది – నా తలాంతుతో కాదు
ఎన్నిక లేని నన్ను – ఎన్నుకున్నది నీ కృపయే
Chorus
కృపయే కృపయే కృపయే యేసయ్య అంతా నీ కృపయే
యేసయ్య అంతా నీ కృపయే