Verse
Reference: ఓ మరణమా, నీ విజయమెక్కడ? ఓ మరణమా, నీ ముల్లెక్కడ? 1 కొరింథీ Corinthians 15:55
Chorus
శ్రేష్టగీతము వినబడుచున్నది యేసు లేచెను - ఈ
కష్టలోకమందు మనకు మిత్రు - డాయనే
Verse
మాయక్షితిని రక్షింప వచ్చిన పరమ నాయకుడు - ఈ
భయంకర చీకటి పోగొట్ట వచ్చిన ప్రభువు
Verse
ముండ్ల కిరీటమును ధరించి ముఖమున గొట్టబడెన్ - ఆ
గండుదొంగను సిలువలో వ్రేలాడి రక్షించెన్
Verse
హీనమైన ఈటెతోడ ప్రక్కన గ్రుచ్చబడెను - ఆ
పావనమగు రక్త ఊట ప్రవహించెన్
Verse
మూడవ దినమున సమాధి నుండి కర్త లేచెను - తన
తోడిశిష్యులు చూచుచుండ నారోహణమాయెన్
Verse
జయము జయము అనుచు నీవు ప్రకటించుము - నీ
జన్మమెల్ల యేసుని గూర్చి సాక్ష్యమీయుము
Verse
ఆరోహణమైనట్లు మరల వచ్చెద ననెను - ఈ
ధరణికి వేంచేయు కాలము సమీపించెను
Verse
హల్లెలూయ పాడుచు నార్భాటముగ నాడు - ఆ
వల్లభుడేసు నెదుట నిలువ నాయత్తపడుము