Verse
శ్రమలందు నీవు నలిగే సమయమున
ప్రభు నీకు తోడుండునని
యోచించలేదా? గమనించలేదా?
ఇమ్మానుయేలుండునని‖ శ్రమలందు ‖
Verse
శ్రమలందు ఏలియాకు కాకోలముచేత
ఆహారము పంపించ లేదా?‖ 2x ‖
ఈనాడు నీకు జీవాహారముతో
నీ ఆకలి తీర్చుట లేదా?‖ 2x శ్రమలందు ‖
Verse
శ్రమలందు యోసేపును ప్రభువు కరుణించి
రాజ్యాధికారమీయలేదా?‖ 2x ‖
ఈనాడు నీదు శ్రమలన్ని తీర్చి
పరలోక రాజ్యమీయలేదా?‖ 2x శ్రమలందు ‖