Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Shramalanu Ponde Sri Yesudu Nee Korakai Siluvalo

శ్రమలను పొందె శ్రీ యేసుడు నీ కొరకై సిలువలో

Shramalanu Ponde Sri Yesudu Nee Korakai Siluvalo

Verse
శ్రమలను పొందె శ్రీ యేసుడు నీ కొరకై సిలువలో
Verse
సదయుడు ప్రేమించె - శత్రువైన నిన్ను
దూరస్థుడవైన నీ యెడల - దయచూపించె
వహించె నీ శాపం భరించె నీ పాపం
నీ మనస్సు మార్చుకొనిన - సంతసించును ప్రభుయేసు
Verse
దొంగవై నీవున్నా - దురితంబులెన్నున్నా
దోషంబుల క్షమియించు - తన సిలువ రక్తముతో
తెరచెనుగా నీ కొరకు - పరలోక ద్వారము
నెమ్మది నిచ్చును నీకు - యేసుని విశ్వసించిన
Verse
ఎవరేసు రక్తములో - కడుగబడెదరో
వారే చేరెదరు - తన సంఘమునందు
అంగీకరించుము - యేసును నీవు
కలిగించు నీకు తృప్తిని - నేడే నీ వాయనను వేడు
Verse
సిలువపై యేసు - సర్వ మర్పించె
నీ రక్షణ కొరకు - క్రయము చెల్లించె
యేసునకు నీవు - ఏమియ్యగలవు?
తెరువు నీ హృదయ ద్వారమును - నేడే ప్రవేశించును తాను

Related Tags

RepentanceSalvationGood FridaySacrifice