Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Shree Raajilluchu Yesu Kreesthu

శ్రీ రాజిల్లుచు యేసు క్రీస్తు

Shree Raajilluchu Yesu Kreesthu

Lyricist: John Choudary
Verse
శ్రీ రాజిల్లుచు యేసు
క్రీస్తు వేంచేసెను
భారతిని జయించి
ప్రజాళిన్ బ్రోచును!
ఆరాజు శాశ్వితుండు
భూరిదయాళుఁడు
వీరాగ్రేసరుండాజిన్
విజయ ధ్వజంబదె!
Verse
ఆ హిమాచలమందు
నాటెక్కె మెత్తెను
కాహళ ధ్వనియందుఁ
గ్రందుకొనెనటన్!
సౌహార్థ భావమూని
జనాళిన్ బ్రోచుఁగ
ఆహా యీ యేసుప్రేమ
యాశ్చర్యమైనది!
Verse
ఆంధ్ర కాశ్మీర వంగ
ఆ సేతువాసులు
ఆంధ్రప్రాయులైయున్న
యరణ్యవాసులున్
బంధ విముక్తలౌచుఁ
ప్రభువైన యేసుని
బంధుర సేవచేయు
వారలయ్యెదరు
Verse
వీరెల్లఁ క్రీస్తునందు
విశ్వాసముంచిన
ఆ రాజు వీరిన్ శాశ్వ
తానంద సామ్రాజ్య
ధౌరేయులన్ గావించు
ఔర! యీ వార్తను
స్ఫారానందంబుతోడఁ
జాటుదు రెవ్వరు!
Verse
భేరీ తూరారవాది
గా రక్షావార్తను
దోరంపుఁ గోర్కెఁ జాటు
మో దేశ సంఘమా!
సౌరభ్యమౌ నీ ప్రేమ
సారంబు జూపుము
ధీరతన్ యుద్ధమందుఁ
బోరాడి గెల్వుము

Related Tags

GospelEvangelismMissionary