Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Shree Rakshakundu Puttanga Naakasha

శ్రీ రక్షకుండు పుట్టఁగా నాకాశ

Shree Rakshakundu Puttanga Naakasha

Lyricist: Edmund Hamilton Sears
Verse
శ్రీ రక్షకుండు పుట్టఁగా
నాకాశ సైన్యము
ఇహంబున కేతెంచుచు
ఈ పాట పాడెను.
'పరంబునందు స్వామికి
మహా ప్రభావము
ఇహంబునందు శాంతిని
వ్యాపింపనీయుఁడు'.
Verse
ఆ రమ్యమైన గానము
ఈ వేళ మ్రోగును
సంతుష్టులైన భక్తులు
ఆ ధ్వని విందురు
ప్రయాసపడు ప్రజల
దుఃఖంబు తీరఁగా
ఆ శ్రావ్యమైన గానము
ఈ వేళ విందురు.
Verse
పూర్వంబు దూతగానము
భువిన్ వినంబడి
రెండువేల వర్షములు
గతించిపోయెను
భూప్రజలు విరోధులై
యుద్ధంబు లాడి యా
మనోజ్ఞమైన గానము
నలక్ష్యపెట్టిరి.
Verse
పాపాత్ములారా, వినుఁడి
శ్రీ యేసు ప్రభువు
మీ పాపభార మంతయు
వహింప వచ్చెను
తాపత్రయంబు నంతయుఁ
దానే వహించును
సంపూర్ణ శాంతి సంపద
లను గ్రహించును.
Verse
సద్భక్తులు స్తుతించిన
ఈ సత్యయుగము
ఈ వేళ నే నిజంబుగా
సమీప మాయెను
ఆ కాలమందు క్షేమము
వ్యాపించుచుండెను
ఆ దివ్య గాన మందఱు
పాడుచు నెప్పుడు.

Related Tags

SalvationChristmasPeace