Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Shree Rakshakuni Naamamu Keerthimchi Kolvudi

శ్రీ రక్షకుని నామము కీర్తించి కొల్వుడి

Shree Rakshakuni Naamamu Keerthimchi Kolvudi

Verse 1
Reference: దావీదు కుమారునికి జయము. ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగాక. సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి. మత్తయి 21:9
Verse
శ్రీ రక్షకుని నామము - కీర్తించి కొల్వుడి
కిరీటముంచి చాటుడి - శ్రీ రాజా, రాజా, రాజా, రాజాధిరాజా!‖ 4x ‖
Verse
శ్రీ యేసుని హత సాక్షులారా - మీ రాజు యీయనే
కిరీటముంచి చాటుడి - శ్రీ రాజా, రాజా, రాజా, రాజాధిరాజా!‖ 4x ‖
Verse
నరులారా మీ కొరకు - మరణంబు నొందెను
కిరీటముంచి చాటుడి - శ్రీ రాజా, రాజా, రాజా, రాజాధిరాజా!‖ 4x ‖
Verse
సర్వ జనాంగములారా - శరణ్యు డీయనే
కిరీటముంచి చాటుడి - శ్రీ రాజా, రాజా, రాజా, రాజాధిరాజా!‖ 4x ‖
Verse
పరంబునందు యేసుకు గిరీటముంచుచు
హర్షంబుతో గీర్తింతుము - శ్రీ రాజా, రాజా, రాజా, రాజాధిరాజా!‖ 4x ‖

Related Tags

PraiseWorshipJesus