Verse
శ్రీ రక్షకుని నామము
కీర్తించి కొల్వుఁడీ
కిరీట ముంచి చాటుఁడి
-శ్రీ రాజా, రాజా, రాజా,
రాజాధిరాజా!
Verse
పరేశుహత సైన్యమా
మీ రాజు ఈయనే
కిరీట ముంచి చాటుఁడి
-శ్రీ రాజా, రాజా, రాజా,
రాజాధిరాజా!
Verse
నరులారా! మీ కోసము
చావును నొందెను
కిరీట ముంచి చాటుఁడి
-శ్రీ రాజా, రాజా, రాజా,
రాజాధిరాజా!
Verse
సర్వ జనాంగములారా!
శరణ్యుఁ డీయనే
కిరీట ముంచి చాటుఁడి
-శ్రీ రాజా, రాజా, రాజా,
రాజాధిరాజా!
Verse
పరంబునందు యేసుకుఁ
కిరీట ముంచుచు
హర్షంబుతోఁ గీర్తింతుము
-శ్రీ రాజా, రాజా, రాజా,
రాజాధిరాజా!