Verse
శ్రీ వినోద దాయకంబు దేవుని వాక్యంబు జీవమునకు నాస్పదంబు
చిరమగు ధనంబు భావంబుల మార్చు నంబు బహుళ సాధనంబు‖ శ్రీ ‖
Verse
పాప తతికి నాయుధంబు పాపి కాశ్రయంబు భూపతులకు దుస్తరంబు
పుణ్య సాధనంబు శాప మడంచెడు శరంబు జగతికి విభవంబు‖ శ్రీ ‖
Verse
స్వాతంత్ర్య మిడు దనంబు సర్వశ్రేయంబు ఘాతకులకు ఖడ్గంబు
నీతికినిలయంబు ప్రీతిని గరపెడు విధంబు ఖ్యాతికిఁ బథంబు‖ శ్రీ ‖
Verse
సత్య విరాజితంబు నిత్య శోభితంబు భృత్య వరుల సంచకరము
భీతున కభయంబు చేతో విభవంబు సుగుణ శిష్యుల హారంబు‖ శ్రీ ‖
Verse
కర్తఁ జూపు నద్దంబు ఘనమహాద్భుతంబు దురితతతికి నస్త్రంబు దు
ఖశోషణంబు పరమోపదేశంబు బహుళమానితంబు‖ శ్రీ ‖
Verse
సర్వజనులకును హితంబు సౌఖ్యసాధనంబు శాంతికి నిజమార్గంబు
జగడముల హరంబు జగము నంతకును వరంబు సత్యవిజయంబు‖ శ్రీ ‖
Verse
కోలాహల కారణంబు చాల ప్రాచీనంబు మూలమౌ ధనంబు జగము
నేలెడి తంత్రంబు జాలియె దన సూత్రంబు మేలు భూషణంబు‖ శ్రీ ‖
Verse
జ్ఞానికి దుర్ గ్రాహ్యంబు దాని బోధనంబు దీనజనుల కర్థంబు దివ్య
శోభితంబు మానితభక్తిని దినంబు మానని పఠనంబు‖ శ్రీ ‖