Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Shree Yaesu Dhivya Naamasmarana Cheyave

శ్రీ యేసు దివ్య నామస్మరణ చేయవే

Shree Yaesu Dhivya Naamasmarana Cheyave

Lyricist: Panthagani Paradeshi
Chorus
శ్రీ యేసు దివ్య నామస్మరణ చేయవే మనసా
పాయక స్మరియించి పరము పొందువే మనసా‖ శ్రీ ‖
Verse
నరుల పాప హరణమునకై నరుడయ్యె మనసా
పరమ పుర ద్వారంబు మనకు తెరచెనే మనసా‖ శ్రీ ‖
Verse
నరుల పాప శాప ఫలము నరకమే మనసా
ఆ మరణమును తొలంచప్రభువే నుడిసె నేమనసా‖ శ్రీ ‖
Verse
పాపమునకు ప్రాయశ్చిత్తం భవ్యమే గదా
ప్రభువే ప్రాయశ్చిత్త బలియై పరగెనే మనసా‖ శ్రీ ‖
Verse
సిలువవేసి ప్రభుని ప్రజలు చంపిరే మనసా
ఆ బలుడు తిరిగి లేచి మృతిని గెలిచేనే మనసా‖ శ్రీ ‖
Verse
గెలిచి యేసు హితులమధ్య నిలిచెనే మనసా
నిలిచి సమాధాన మంచు పలికెనే మనసా‖ శ్రీ ‖
Verse
పునరుత్థాన మేసు దేవ పుత్రుడని మహా
ఘనముగా ప్రకటించుచుండ కాననే మనసా‖ శ్రీ ‖
Verse
తానె మార్గం తానెసత్యం తానెజీవము
ఈ ఘన సత్యంబు నమ్మునరులు ధన్యులే మనసా‖ శ్రీ ‖
Verse
నిన్ను నీ వెరింగి ప్రభుని నెరుగ వే మనసా
సన్నుతు డందుల కొసంగె సత్యవేదము‖ శ్రీ ‖
Verse
పాపములకు పరితపించి ప్రభుని జేరవే
దాపునకు రమ్మంచు కరము చాపేనే మనసా‖ శ్రీ ‖
Verse
ఎంత ఘోరపాపమైన నెంచడే మనసా
ఎంత మొత్తమైనను క్షమి యించునే మనసా‖ శ్రీ ‖
Verse
బ్రతుకు శాశ్వతంబు కాదు పరికించు మనసా
ఈ బతుక్నందె ప్రభుని పదము పట్టుకో మనసా‖ శ్రీ ‖
Verse
జనక కుమారాత్మ దేవున్ జపియించు మనసా
అనయమును స్మరించు స్వర్గ మద్దియే మనసా‖ శ్రీ ‖

Related Tags

WorshipSalvationJesus