Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Shree Yaesu Karthanu Sevan Jeyutaku

శ్రీ యేసు కర్తను సేవఁ జేయుటకు

Shree Yaesu Karthanu Sevan Jeyutaku

Lyricist: Bethala John
Chorus
శ్రీ యేసు కర్తను సేవఁ జేయుటకు మేల్కొను శ్రీయేసు కర్తను
శ్రేయముల నెఱింగి నీకు రేయిపవ లొసంగి యెడఁ బాయని
యంతరంగి యపాయంబుఁ ద్రోయ సహాయంబుఁజేయ‖ శ్రీ యేసు ‖
Verse
నిదురయందు నేఁడు క్షేమ మొదవఁ గాచినాఁడు సూర్యుఁడుదయ
మాయెఁజూడు నీ హృదయమున సదమల పదవులుదయింప‖ శ్రీ యేసు ‖
Verse
అంధకార మణఁగెన్ హృదయాంధకార మణఁగెన్ ప్రభు
నందుఁ దెలివి గలుగన్ నిబంధనలు డేందమున కందముగఁ గూర్చి‖ శ్రీ యేసు ‖
Verse
కంటిపాప వలెను నిను గాయువాని దయను గనుఁ గొంటివి
స్తోత్రమును జేయు మింటి కినిమంటికన్నింటికిని కర్తయని‖ శ్రీ యేసు ‖
Verse
కలకల ధ్వనిఁజేయు పక్కిగములు లయను గూయు సర్వములు
ప్రభు స్తుతిఁజేయు నీ వలయక సొలయక వెలయఁగఁ బాడు‖ శ్రీ యేసు ‖
Verse
సేవయందు నీకు మంచి యీవు లిడుపరాకు గల భావముఁబడఁ
బోకు నేడుఁ కానవే కావవే కావవే యంచు‖ శ్రీ యేసు ‖
Verse
పగటివార మంచు నిష్ఫ్లపు గ్రియలు ద్రుంచు యుగ యుగములు
జీవించు పురికెగయ నీ దిగులు విడు తగు నమ్మకమున‖ శ్రీ యేసు ‖
Verse
మింటి నంటఁ బాడు నీ యొంటి బలిమి నేఁడు ప్రభు నంటి యుండ
వాఁడు నిన్నొంటి నెన్నంటి కెన్నింటికిన్వీడఁడు‖ శ్రీ యేసు ‖

Related Tags

WorshipDevotionalMorning Prayer