Chorus
శ్రీ యేసు నాథుని శిరసావహించి
శిష్యుల మేసును ఘనపరచెదము
Verse
పాపుల రక్షింఫ నవనికి వచ్చెను
ఏపుగ కౌగలించి సన్నుతించెదము
Verse
డెంద మేసునిచేత హర్షము బొందె
అందమగు యేసుని స్తుతించెదము
Verse
పాపకూపము నుండి ఎత్తి రక్షించెను
భీకర ధ్వనితోడ భజియించెదము
Verse
మరణపు ముల్లును విరచి జయించిన
కరుణాబ్ధి యేసుని స్మరియించెదము
Verse
దూరస్థులగు వారలను చెంత చేర్చెను
నిరతము యేసుని సన్నుతించెదము
Verse
రక్తితో హల్లెలూయ ఆనందముతో పాడి
శక్తిగల యేసుని స్తుతియించెదము