Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Shree Yaesu Raajyamumdunu Sooryumdu Velgu Choatella

శ్రీ యేసు రాజ్యముండును సూర్యుండు వెల్గు చోటెల్ల

Shree Yaesu Raajyamumdunu Sooryumdu Velgu Choatella

Verse
శ్రీ యేసు రాజ్యముండును - సూర్యుండు వెల్గు చోటెల్ల
కల్పాంత కాలమౌదాక - యా రాజ్యము వ్యాపించును
Verse
నిరతంబు ప్రార్థనల్ - నిత్యస్తుతుల్ శ్రీ యేసుకు
తన్నామము ప్రత్యహము - సుగంధమట్లు లేచును
Verse
సమస్తదేశవాసులు - గణింతురేసు ప్రేమను
శ్రీ యేసు పేరు బాలకుల్ - బాల్యంబున స్తుతింతురు
Verse
యేసుని యీవు లొల్కును - ఖైదీకి సంకెళ్ళూడును
డాయంగ శాంతి కల్గును - సుభాగ్య మబ్బుఁపేదకున్
Verse
శ్రీ యేసు శక్తిచేతను - స్వస్థంబు గల్గు నెల్లడన్
దచ్ఛక్తియున్న మేరలను - నశించు మృత్యుశాపముల్
Verse
మా రాజు మాకెల్ల సృష్టియున్ - విశేష స్తుతుల్ సల్పుతన్
దూతాళి మళ్ళి పాడఁగా - ఘోషించు భూమియు ఆమేన్

Related Tags

PraiseEternalKingdom