Verse
శ్రీ యేసు స్వామి తిరిగి - మోక్షంబు జేరగా
ఒక్కాదరణ కర్తను - వొసంగెను
Verse
ఆ దేవునాత్మ ప్రీతిగా - మదిన్ వసించును
విధేయులైన మనలన్ - బాలించును
Verse
సద్గుణమున్న మనకు - ఆ యాత్మ దానము
శోధించు దుష్టుని సహా - జయించును
Verse
ఓ దేవునాత్మ మమ్మును - విశుద్ధి పర్చుము
మా కృదయంబులో సదా – వసించుము