Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Shree Yehova Nee Kosangedha Shreya Ma

శ్రీ యెహోవా నీ కొసంగెద శ్రేయ మ

Shree Yehova Nee Kosangedha Shreya Ma

Lyricist: Veshapogu Gulbanamma
Chorus
శ్రీ యెహోవా నీ కొసంగెద శ్రేయ మొదవఁగ నాదు సంపదఁ బాయక
నీ సమ్ముఖమ్మున నే యెడ నివసింతు భక్తితో‖ శ్రీ ‖
Verse
అడఁకువతో నీ పాదములఁబడి యొడయుఁడా నావెల్ల నీకిడి తడవు
చేయక కొల్తు నిన్నుఁ దండ్రి నన్నంగీకరించుమి‖ శ్రీ ‖
Verse
నీవు నా రాజువు నిరతము నేను నీ బిడ్డను నిశ్చయము పావనాత్ముని
యెదుట నాదు జీవ మిడుదు సజ్జీవనముకయి‖ శ్రీ ‖
Verse
ప్రభువరా యర్పించుకొందు భక్తితోడ నన్ను నిందు శుభప్రదము లగు
శక్తులతో నను సొంపుమీరఁగ నింపు స్వామీ‖ శ్రీ ‖
Verse
మహిమస్తుతులు చెల్లు నీ నా మంబునకు నిత్యంబుగా న న్నిహ పరంబుఁ
బ్రోచువాఁడ నీవె సుమ్మా లోక రక్షకా‖ శ్రీ ‖

Related Tags

WorshipDevotionalSurrender