Chorus
శ్రీ యేసునే భజించు నా మనసా శ్రీ యేసునే భజించు శ్రీ యేసు
ప్రభునే భజించు నా మనసా శ్రీ యేసునే భజించు‖ శ్రీ యేసు ‖
Verse
యేసు త్రిత్వమం దీశ కుమారుఁడు భాసురుఁ డాతఁడు భూషిత రక్షకుఁడు‖ శ్రీ యేసు ‖
Verse
నరుల దురితస్థితిఁ గరుణించి వారికిఁ పరమ సుఖము లిడ పరికించి వచ్చిన‖ శ్రీ యేసు ‖
Verse
స్వామికి మహిమయు భూమికి నెమ్మది క్షేమము నియ్యను లేమిడిఁ బుట్టిన‖ శ్రీ యేసు ‖
Verse
నరులను తండ్రితో నైక్యము జేయగ నిరతము వేఁడెడి నిజప్రాపకుఁ డగు‖ శ్రీ యేసు ‖
Verse
మూఁడవ దినమున మృత్యువు నోడించి తడయక పునరు త్థానము నొందిన‖ శ్రీ యేసు ‖