Chorus
శ్రీ యేసుని వేఁడు మనసా సేవింపవే నేఁడు నీ యఘములను
బాపియు నిను నెడ బాయక కడు సహాయము జేసెడి‖ శ్రీ యేసు ‖
Verse
పాపంబులు వీడి పశ్చా త్తాపబంబును గూడి దాపున జేరుము
దయగల ప్రభువు నీ పాపముఁ బాపియుఁ పాలించును ధర‖ శ్రీ యేసు ‖
Verse
దేవుని మరువకుము దైవ సేవను మరువకుము జీవపుఁ త్రోవను
స్థిరముగ నడువను పావన మనసును బ్రాపుగ నిచ్చెడి‖ శ్రీ యేసు ‖
Verse
రక్తము చిందించెఁ ప్రభువు రక్తితో నీ కొరకు రక్తపు టూటల
శక్తిని నమ్మిన ముక్తి కలుగును భక్తితో నీవు‖ శ్రీ యేసు ‖
Verse
సిలువయే నీ ఘనము క్రీస్తు సిలువయే నీ ధనము సిలువయే
భాగ్యము తులువల కెల్లను సిలువ వలననే కలుగును రక్షణ‖ శ్రీ యేసు ‖