Verse
శ్రేష్ఠుఁడెల్లవారిలోను
మా యేసువే
తల్లికంటె ప్రియుడౌను
మా యేసువే
లోకస్నే హమస్థిరంబు
నేఁడు ప్రేమరేపు కక్ష
స్థిరుడైన మిత్రుడౌను
మా యేసువే
Verse
నాకు నిత్యజీవమౌను
మా యేసువే
సర్వమందు సర్వమౌను
మా యేసువే
నన్ను మేలుకొల్పి ప్రోచి
శుద్ధిచేసి ప్రేమతోడ
నన్ను తన మందఁజేర్చె
మా యేసువే
Verse
ప్రేమమూర్తి సత్యవర్తి
మా యేసువే
ఇహపరభాగ్యమిచ్చు
మా యేసువే
క్రీస్తుకిమ్ము నీదుయాత్మ
నీకు శాంతినిచ్చి కాచి
తుదిఁజేర్చు మోక్షమందు
మా యేసువే
Verse
బాధనొందు మేము చేర
మా యేసువా!
మాకు హర్ష మిచ్చినావు
మా యేసువా!
ఇహమందు నడిపించు
అవసానకాలమందు
మోక్షసౌఖ్య మొందనిమ్ము
మా యేసువా!