Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Shriyesu Rajya Mundunu Suryu

శ్రీయేసు రాజ్య ముండును సూర్యు

Shriyesu Rajya Mundunu Suryu

Lyricist: Isaac Watts
Verse
శ్రీయేసు రాజ్య ముండును
సూర్యుండు వెల్గు చోటెల్ల
కల్పాంతకాల మౌదాక
ఆ రాజ్యము వ్యాపించును.
Verse
నిరంతరంబు ప్రార్థనల్
నిత్య స్తుతుల్ శ్రీయేసుకు
తన్నామము ప్రత్యహము
సుగంధ మట్లు లేచును.
Verse
సమస్త దేశ వాసులు
గణింతు రేసు ప్రేమను
శ్రీ యేసు పేరు బాలకుల్
బాల్యంబున నుతింతురు.
Verse
యేసుని యీవు లొల్కును
ఖైదికి సంకెళ్లూడును
డాయంగ శాంతి కల్గును
సుభాగ్య మబ్బుఁ పేదకున్
Verse
శ్రీ యేసు శక్తి చేతను
స్వస్థంబు గల్గు నెల్లెడన్
దచ్ఛక్తి యున్న మేరలన్
నశించు మృత్యు శాపముల్.
Verse
మా రాజు కెల్ల సృష్టియున్
విశేష స్తుతుల్ సల్పుతన్
దూతాళి మళ్లి పాడఁగా
ఘోషించు భూమియు ఆమేన్

Related Tags

PraiseWorshipKingdom