Verse
శృంగార దేశము చేరగానే నా దుఃఖ బాధలన్నియుపోవున్
యేసుని యొద్దను నిత్యము నే
నుండుట మిక్కిలి యాశ్చర్యము
Chorus
ఇదే నాకు ఆనందము, ఆనందము, ఆనందము
నేను ఆయనను జూచుటయే ఇదే నాకు పరమానందము
Verse
అమితమైన కృపవలన నన్ను స్వర్గంబున జేర్చుదురు
అచ్చోటనుండి యేసుని గాంచి
స్తుతికీర్తనలు పాడుదును
Verse
నేను ప్రేమించు స్నేహితులను అక్కడజూచి సంతోషింతును
నా యేసు ముఖము చూచుటయే
నిత్యము నాకది యానందము
Verse
ఆ స్వర్గ సౌఖ్య మొందువరకు
కండ్లతో చూడక పోయినను యేసుని మాటలు గైకొనుచు
నాత్మతో చూచి సంతోషింతును