Verse
శృంగార ద్వారంబు మా యేసు మోక్ష మార్గంబున కెంతో శృంగార
ద్వారము‖ శృంగార ‖
Verse
పాలును దేనెయుఁ బారెడి కానాను ప్రదేశ భూములకుఁ బ్రవేశ
పెట్టు‖ శృంగార ‖
Verse
యెరూషలేమాలయ పరిశుద్ధ స్థలమందు పరిశుద్ధ జనులుగ బ్రవేశ
పెట్టు‖ శృంగార ‖
Verse
అత్యంత పరిశుద్ధ స్థలమందు మమ్ము నిత్యంబు యాజ కులగాను
జేర్చు‖ శృంగార ‖
Verse
ఇరుకైన నేమది సరియైన ద్వారంబు సంకటంబైనను సౌఖ్యన జేర్చు‖ శృంగార ‖