Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Shrungara Deshamu Cheragane Naa Duhkha

శృంగార దేశము చేరఁగానే నా దుఃఖ

Shrungara Deshamu Cheragane Naa Duhkha

Lyricist: Charles Homer Gabriel
Verse
శృంగార దేశము చేరఁగానే
నా దుఃఖ బాధలన్నియుఁ బోవున్
యేసుని యొద్దను నిత్యమునే
నుండుట మిక్కిలి యాశ్చర్యము
ఇదే నాకు ఆనందము‖ ఇదే నాకు ఆనందము ‖
ఆనందము, ఆనందము
నేను ఆయనను జూచుటయే
ఇదే నాకుఁ బరమానందము
Verse
అమితమైన కృపవలన
నన్ను స్వర్గంబునఁ జేర్చుదురు
అచ్చోటనుండి యేసుని గాంచి
స్తుతి కీర్తనలు పాడుదును.
Verse
నేను ప్రేమించు స్నేహితులును
అక్కడఁ జూచి సంతోషింతును
నాయేసు ముఖము చూచుటయే
నిత్యము నాకది యానందము.
Verse
ఆ స్వర్గ సౌఖ్య మొందువరకు
కండ్లతోఁ జూడక పోయినను
యేసుని మాటలు గైకొనుచు
నాత్మతోఁ జూచి సంతోషింతును

Related Tags

HeavenSalvationJoy