Verse
శుభవార్త వింటిమి - యేసు రక్షించును
ఎల్లవారు విననీ - యేసు రక్షించును
ప్రభుమాట వింటిరె - అది పర్వతంబులన్
దాటి ప్రకటించుడి - యేసు రక్షించును
Verse
ఓడనెక్కి పోవుడి - యేసు రక్షించును
దైవ భ్రష్టు లెల్లరిన్ - యేసు రక్షించును
ద్వీపవాసులందరు - వినునట్లు చాటుడి
దివ్య వర్తమానము - యేసు రక్షించును
Verse
ఇహ బాధనుండియు - యేసు రక్షించును
పరమ భాగ్యమిచ్చును - యేసు రక్షించును
దీన శ్రేష్టు లెల్లరు - భూనివాసులందరు
యీ సువార్త వినుడి - యేసు రక్షించును