Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Shubhavaartha Vimtimi Yesu Rakshimcha

శుభవార్త వింటిమి యేసు రక్షించ

Shubhavaartha Vimtimi Yesu Rakshimcha

Lyricist: Priscilla Jane Owens
Verse
శుభవార్త వింటిమి
యేసు రక్షించును
ఎల్లవారు విననీ
యేసు రక్షించును
ప్రభు మాట వింటిరా
పర్వతంబుల్ దాటుచు
వార్త ప్రకటింపుడి
యేసు రక్షించును
Verse
స్వరమెత్తి పాడుడీ
యేసు రక్షించును
దైవభ్రష్టు లెల్లరిన్
యేసు రక్షించును
ద్వీపవాసు లందఱు
వినునట్లు చాటుఁడి
దివ్యవర్తమానము
యేసు రక్షించును
Verse
ఇహ బాధనుండియు
యేసు రక్షించును
పరభాగ్యమిచ్చును
యేసు రక్షించును
దీనుజను లెల్లరు
భూనివాసులందఱు
ఈ సువార్త వినుఁడీ
యేసు రక్షించును

Related Tags

GospelSalvationEvangelism