Verse
శుద్ధ ఆత్మ దిగిరమ్ము - మా పై వేగమే
శుద్ధి యేసు నీ ఈవుల మాకీయుమా
Verse
పెంతెకోస్తను నాట దిగివచ్చిన
ప్రియ ఆత్మ దిగిరమ్ము ఈ వేళయందు
Verse
దప్పిగొన్న ఆత్మలను దప్పి తీర్చును
తప్పక ఒక్కొక్కరిని సంధించు వేగ
Verse
ప్రేమతోడనే శుద్ధ పావురమా రా
డాసి మమ్ము యుద్ధమునకు సిద్ధపర్చుమా
Verse
నిద్ర కష్టముల సోమరత్వమున్ వీడి
స్తోత్రింప నుత్సాహమును మా పై పోయుమా
Verse
గత కాలమందు జయమిచ్చిన యట్టి
నూతన ప్రార్థన వాంఛ మాలో పోయుమా
Verse
అనుదిన మాత్మలను సంపాదించను
గిన్నెనిండి పొర్లిపార నాత్మనీయుము
Verse
ప్రేమ దీనత్వము శాంత సమాధానముల్
సంతోషము మాలో వృద్ధి పొందజేయుమా