Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Shuddha Raathri

శుద్ధ రాత్రి

Shuddha Raathri

Verse
శుద్ధ రాత్రి! సద్ధణంగా
నందరు నిద్రపోవ
శుద్ధ దంపతుల్ మేల్కొనగా
బరిశుద్దుడౌ బాలకుడా!
దివ్య నిద్ర పొమ్మా‖ 2x ‖
Verse
శుద్ధ రాత్రి! సద్ధణంగా
దూతల హల్లెలూయ
గొల్లవాండ్రకు దెలిపెను
ఎందు కిట్టులు పాడెదరు?
క్రీస్తు జన్మించెను‖ 2x ‖
Verse
శుద్ధ రాత్రి! సద్ధణంగా
దేవుని కొమరుడ
నీ ముఖంబున బ్రేమలొల్కు
నేడు రక్షణ మాకు వచ్చె
నీవు పుట్టుటచే‖ 2x ‖

Related Tags

ChristmasNativitySilent Night