Verse
శుద్ధుడవయ్యా మా తండ్రివయ్యా
పాపము బాప వచ్చితివయ్యా
శుద్ధుడవయ్యా మా తండ్రివయ్యా
రక్షణ భాగ్యం తెచ్చితివయ్యా
సిద్ధపడే శుద్ధ దేహం
సిలువనెక్కె సందేశం
ఆసనమో తండ్రి చిత్తం
ఆరంభమో కల్వరి పయనం‖ శుద్ధు ‖
Verse
చెమట రక్తముగా మారెనే
ఎంతో వేదనను అనుభవించే
ప్రార్ధించెను గిన్నె తొలగించుమని యేసు
జ్ఞాపకమాయెనే తండ్రి చిత్తం‖ 2x సిద్ధపడే ‖
Verse
చిందించె రక్తము నా కొరకే
ప్రవహించే రక్తము పాపులకై
రక్తపు బొట్టు ఒకటి లేకపోయే
ప్రక్కలో బల్లెపు పోటు గ్రక్కున దిగెనే‖ 2x సిద్ధపడే ‖