Verse
సిలువ బరువయెనా రుధిరం ధారలయేనా
దేహం నలిగిపోయెనా దైవం సిలువ మోసెనా
Verse
కలువరి గిరి సాక్ష్యమా పాపికై ఇంతటి బలియాగమా
కాలమే ఎన్నడు చూడని ఘోరమా నరులకై ఇంతటి త్యాగమా
దేవుని ప్రేమ ఇదే కదా లోకమూ పొందెను విడుదల
Verse
ఏ నేరము లేకున్ననూ అన్యాయపూ తీర్పు పొందెను
ప్రతి దోషమూ తొలగించగా బలియాయెను తానే గొఱ్ఱెపిల్లగా
ప్రతి నరునికై విమోచన ధనముగా ఆ దేవుడే ప్రాణమునర్పించెను
జీవమూ అందరికివ్వనూ విగత జీవిగా సిలువలో వ్రేలడెను