Verse
సిలువ చెంత చేరిననాడు
కలుషములను కడిగివేయున్
పౌలువలెను సీలవలెను
సిద్ధపడిన భక్తులజూచి
Verse
కొండలాంటి బండలాంటి
మొండి హృదయంబు మండించు
పండియున్న పాపులనైన
పిలచుచుండే పరము చేర‖ సిలువ ‖
Verse
వంద గొర్రెల మందలోనుండి
ఒకటి తప్పి ఒంటరియాయే
తొంబది తొమ్మిది గొర్రెల విడిచి
ఒంటరియైన గొర్రెను వెదకెన్‖ సిలువ ‖
Verse
తప్పిపోయిన కుమారుండు
తండ్రిని విడచి తరలిపోయే
తప్పు తెలిసి తిరిగిరాగా
తండ్రియతని జేర్చుకొనియే‖ సిలువ ‖
Verse
పాపి రావా పాపము విడచి
పరిశుద్ధుల విందుల జేర
పాపుల గతిని పరికించితివా
పాతాళంబే వారి యంతము‖ సిలువ ‖