Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Siluva Chentha Cherinanadu Kalushamulanu Kadigiveyu

సిలువ చెంత చేరిననాడు కలుషములను కడిగివేయు

Siluva Chentha Cherinanadu Kalushamulanu Kadigiveyu

Chorus
సిలువ చెంత చేరిననాడు - కలుషములను కడిగివేయు
పౌలు వలెను సీల వలెను - సిద్ధపడిన భక్తుల జూచి‖ సిలువ ‖
Verse
కొండవంటి బండవంటి - మొండి హృదయంబు మండించు
పండియున్న పాపులనైన - పిలుచుచుండె పరము చేర‖ సిలువ ‖
Verse
వంద గొఱ్ఱెల మంద నుండి - ఒకటి తప్పి ఒంటరియాయె
తొంబదితొమ్మిది గొఱ్ఱెలవిడచి - ఒంటరియైన గొఱ్ఱెను వెదకెన్‖ సిలువ ‖
Verse
తప్పిపొయిన కుమారుండు - తండ్రిని విడచి తరలిపొయె
తప్పు తెలిసి తిరిగిరాగా - తండ్రి యతని చేర్చుకొనెను‖ సిలువ ‖
Verse
పాపి రావా పాపము విడచి - పరిశుద్ధు విందులొ చేర
పాపుల గతిని పరికించితివా - పాతాళంబే వారి యంతము‖ సిలువ ‖

Related Tags

RepentanceSalvationGood Friday