Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Siluva Dhyaanam

సిలువ ధ్యానం

Siluva Dhyaanam

Verse
నీ సిలువే నా శరణము‖ 2x ‖
విలువైన రుధిరాన్ని కార్చి
వెలపోసి నన్ను కొన్నావు‖ 2x ‖
ప్రేమా త్యాగం నీవే యేసయ్యా
మహిమా నీకే ఆరోపింతును
Verse
గాయాలు పొందినావు – వెలివేయబడినావు
నా శిక్ష నీవు పొంది – రక్షణను కనుపరచావు‖ 2x ‖
నీ ప్రేమ ఇంత అంతని – నే తెలుపలేను
నీ కృపను చాటెదన్ – నా జీవితాంతము
Verse
నేరము చేయని నీవు – ఈ ఘోర పాపి కొరకు
భారమైన సిలువ – మోయలేక మోసావు
కొరడాలు చెళ్ళని చీల్చెనే – నీ సుందర దేహమునే‖ 2x ‖
తడిపెను నీ తనువునే రుధిరంబు ధారలే‖ 2x ‖
వెలి అయిన యేసయ్యా – బలి అయిన యేసయ్యా‖ 2x ‖
Verse
సిలువలో ఆ సిలువలో – ఆ ఘోర కల్వరిలో
తులువల మధ్యలో వ్రేళాడిన యేసయ్యా‖ 2x ‖
Verse
విలువే లేని నా బ్రతుకును – విలువ పెట్టి కొన్నావయ్యా‖ 2x ‖
నాదు పాపమంతయూ‖ 2x ‖
నీదు భుజముపై మోసావయ్యా‖ 2x ‖
Verse
గొల్గొతా కొండ పైన‖ 2x ‖
గాయాలు పొందితివే‖ 3x ‖
Verse
చెమటయు రక్తముగా – ఆత్మల వేదనయూ‖ 2x ‖
పొందెను యేసు నీ కొరకే
తండ్రీ నీ చిత్తం – సిద్ధించు గాక అని పలికెను‖ 2x ‖
Verse
కల్వారిలో జీవామిచ్చెన్‖ 2x ‖
నీ పాపములను తొలగించుటకై
నీదు సిలువన్ మోసెను యేసు‖ 2x ‖
Verse
రగిలిందిలే ఒక జ్వాలలా – ప్రభు యేసు హృదయము
కరిగిందిలే ఒక ధారలా – పరమాత్మ రుధిరము
చలించిపోయెనే ఆ సిలువ ధాటికి‖ 2x ‖
కసాయి చేతిలో అల్లాడిపోయెనే‖ 2x ‖
Verse
రగిలిందిలే ఒక జ్వాలలా – ప్రభు యేసు హృదయము
కరిగిందిలే ఒక ధారలా – పరమాత్మ రుధిరము
Verse
కృపా సత్య దేవా – సిలువలో మాకై బలియై
రక్తము చిందించినావు – రక్షణిచ్చినావు‖ 2x ‖
ఆరాధింతుము నిన్ను యేసు – ఆత్మ సత్యముతో
పాడి కొనియాడి కీర్తింతుము
పూజించి ఘనపరతుము
Verse
హాల్లేలూయా హాల్లేలూయా‖ 3x ‖
నిన్నే ఆరాధింతుమ్‖ 3x ‖

Related Tags

WorshipRepentanceGood Friday