Verse
సిలువ సైనికులారా నిలువండి వడి లేచి బలుఁడు యేసుక్రీస్తు ప్రభు
దయ జయ మౌను‖ సిలువ ‖
Verse
రారాజు పంపున రణము సేయగఁ బూని ధీరులై నిలువుఁడి దినము
శత్రుల గెల్వ‖ సిలువ ‖
Verse
అతఁడు నిజ ధ్వజ మత్యున్నతి నొంద బ్రతి వీరుని గెల్చు వరకుసేనల
నడుపు‖ సిలువ ‖
Verse
మీ స్వీయ బలమున మీ రానుకొనకయే మీ స్వామి బలమును
మీరు నమ్మి గెలువ‖ సిలువ ‖
Verse
శత సహస్రము లైన శత్రుల నెదిరించి సతతము ప్రభు సేవ సల్పి
ధైర్యము నొంది‖ సిలువ ‖
Verse
దేవుఁ డొసఁగినట్టి దివ్య కవచముఁ దాల్చి భావ ప్రార్థనాసి బట్టి
యుద్ధము సేయ‖ సిలువ ‖
Verse
జయశీలు రగు వారు చారు కిరీట మంది జయశాలి క్రీస్తు దయ
జనెదరు సద్గతికి‖ సిలువ ‖