Verse
సిలువ సాక్షిగా యేసు సిలువను
సిలువ మోయుచు ప్రకటించెదను‖ 2x ‖
ఇదే నా వేదన – ఇదే నా ప్రార్థన‖ సిలువ ‖
యేసు ఒళ్ళు చీల్చెను కుల కొరడా దెబ్బలే
క్రీస్తు తలను గుచ్చెను మత ముళ్ల కిరీటమే‖ 2x ‖
మేకులు దిగ గొట్టెను పదవి వ్యామోహమే
సిలువలో వ్రేలాడ దీసెను అధికారమే
కులమా కళ్ళు పొడచుకో – మతమా ఉరి పోసుకో‖ సిలువ ‖
లోక పాప క్షమాపణ యేసు సిలువ రక్తమే
పాప శాప విమోచన యేసు సిలువ మార్గమే‖ 2x ‖
దైవమా నవ పాలన క్రీస్తు సిలువ జీవమే
సమ సమాజ స్థాపనలో యేసు సిలువ సత్యమే
కులమా కళ్ళు పొడచుకో – మతమా ఉరి పోసుకో‖ సిలువ ‖