Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Siluva Veeruda Suvartha Yodhuda

సిలువ వీరుడా సువార్త యోధుడా

Siluva Veeruda Suvartha Yodhuda

Lyricist: Dr Issac Raj Alanka
Verse
సిలువ వీరుడా – సువార్త యోధుడా
క్రీస్తు రాజ్య పౌరుడా – పరలోక వారసుడా
లెమ్ము తేజరిల్లుమా – వెలుగు వచ్చి యున్నది
లెమ్ము ప్రజ్వరిల్లుమా – అగ్ని మండుచున్నది‖ 2x ‖
లోకమంత చీకటి ఆవరించి యుండగా
దుష్టసాతానుడు చెలరేగు చుండగా‖ 2x ‖
దైవ వాక్య బలముతో – సత్యవాక్య వెలుగుతో
క్రీస్తు రాజ్యం స్థాపించి – సాతానును తరుముదాం‖ 2x ‖
పాపశాపబంధకాలు విస్తరిస్తుండగా
కన్నీరు బ్రతుకులను కృంగజేయుచుండగా‖ 2x ‖
ప్రార్ధనా శక్తితో – ప్రవచనాత్మ వరముతో
క్రీస్తు రక్తం ప్రోక్షించి – దీవెనలలు నింపుదాం‖ 2x ‖

Related Tags

GospelSpiritual WarfareEvangelism