Chorus
సిలువ యోధులం సిలువ యోధులం
క్రీస్తు సిలువ రాజ్యములో వెలుగు బిడ్డలం
Verse
పాపలోక రీతులలో నరక కూపయాతనలో‖ 2x ‖
నలిగి కరిగి మలిగిపోవు మానవాళి
వెతకి బ్రతుకు వెతల వీడ మదిని హృదిని పదిల పరచు
స్వర్గమార్గమందు చేర్చు సిలువ యోధులం
Verse
కన్యాకుమారి మొదలు కైలాసపు కొండవరకు‖ 2x ‖
సాటిలేని వెలుగు బాట యెరుషలేము
గిరుల వరకు సరిగ నాటి వడిగ నడచి శ్రమల గడచి
యాత్రకోర్చి సాగిపోవు సిలువ యోధులం