Verse
సిలువచెంత చేరిననాడు కలుషములను కడిగివేయు
పౌలు వలెను సీల వలెను సిద్ధపడిన భక్తుల జూచి
Verse
కొండవంటి బండవంటి మొండి హృదయంబు మండించు
పండియున్న పాపులనైన పిలుచుచుండె పరము చేర
Verse
వంద గొర్రెల మందనుండి ఒకటి తప్పి ఒంటరియాయె
తొంబదితొమ్మిది గొర్రెలవిడిచి ఒంటరియైన గొర్రెను వెదకెన్
Verse
తప్పిపోయిన కుమారుండు తండ్రిని విడచి తరలిపోయె
తప్పు తెలిసి తిరిగిరాగా తండ్రి యతని చేర్చుకొనెను
Verse
పాపి రావా పాపము విడచి పరిశుద్దుల విందులో చేర
పాపుల గతిని పరికించితివా పాతాలంబే వారి యంతం