Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Siluvalo Aa Siluvalo

సిలువలో ఆ సిలువలో

Siluvalo Aa Siluvalo

Lyricist: Devaraj
Verse
సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో
తులువల మధ్యలో వ్రేళాడిన యేసయ్యా‖ 2x ‖
వెలి అయిన యేసయ్యా – బలి అయిన యేసయ్యా
నిలువెల్ల నలిగితివా – నీవెంతో అలసితివా‖ సిలువ ‖
Verse
నేరము చేయని నీవు – ఈ ఘోర పాపి కొరకు
భారమైన సిలువ- మోయలేక మోసావు‖ 2x ‖
కొరడాలు చెల్లని చీల్చెనే – నీ సుందర దేహమునే‖ 2x ‖
తడిపెను నీ తనువునే – రుధిరంబు ధారలే‖ 2x వెలి ‖
Verse
వధకు సిద్దమైన గొర్రెపిల్ల వోలె
మోమున ఉమ్మివేయ మౌనివైనావే‖ 2x ‖
దూషించి అపహసించి హింసించిరా నిన్ను‖ 2x ‖
ఊహకు అందదు నీ త్యాగమేసయ్యా‖ 2x వెలి ‖
Verse
నాదు పాప భారం – నిను సిలువకు గురి చేసెనే
నాదు దోషమే నిన్ను – అణువణువున హింసించెనే‖ 2x ‖
నీవు కార్చిన రక్త ధారలే – నా రక్షణకాధారం‖ 2x ‖
సిలువలో చేరెదన్ – విరిగిన హృదయముతోను‖ 2x వెలి ‖

Related Tags

RepentanceGood FridaySacrifice