Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Siluvalo Aa Siluvalo Aa Ghora Kalvarilo

సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో

Siluvalo Aa Siluvalo Aa Ghora Kalvarilo

Verse
సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో
తులువల మధ్యలో వ్రేలాడిన యేసయ్యా
వెలియైన యేసయ్యా బలియైన యేసయ్యా
నిలువెల్ల నలిగితివా నీవెంతో అలసితివా‖ 2x ‖
Verse
నేరం చేయని నీవు ఈ ఘోరపాపి కొరకు
భారమైన సిలువ మోయలేక మోసావు‖ 2x ‖
కొరడాలు చెళ్ళిని చీల్చెనే నీ సుందర దేహమునే
తడిపెను నీ తనువును రుధిరంపు ధారలు
Verse
వధకు సిద్దమైన గొర్రెపిల్ల వోలె
మోమున ఉమ్మివేయ మౌనివైనావే‖ 2x ‖
దూషించి అపహసించి హింసించిరా నిన్ను
ఊహకు అందదు నీ త్యాగ యేసయ్యా
Verse
నాదు పాపమె నిన్ను సిలువకు గురిచేసెన్
నాదు దోషమె నిన్ను అణువణువున హింసించెన్
నీవు కార్చిన రక్తధారలే నా రక్షణాధారం
సిలువను చేరెదన్ విరిగిన హృదయముతోను

Related Tags

Good FridaySacrificePassion