Verse
సిలువలో బలి అయిన దేవుని గొర్రెపిల్ల
విలువైన నీ ప్రేమన్ వివరింతున్ శ్రీ యేసు
Verse
ఆ నాటి యూదులే నిను చంపిరనుకొంటి
కాదు కాదయ్యయ్యో నా పాప ఋనమునకే‖ సిలువలో ‖
Verse
నా అతిక్రయములకై నలుగ గొట్టబడి
నా దోషముల నీవు ఫ్రియముగను మోసితివి‖ సిలువలో ‖
Verse
మృదువైన నీ నుదురు ముండ్ల పోట్లచేత
సురూప-ము లేక సోలిపోతివ ప్రియుడ‖ సిలువలో ‖