Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Siluvalo Baliyaina Devuni Gorrepilla

సిలువలో బలియైన దేవుని గొర్రెపిల్ల

Siluvalo Baliyaina Devuni Gorrepilla

Verse
సిలువలో బలియైన దేవుని గొర్రెపిల్ల
విలువైన నీ ప్రేమన్ వివరింతు శ్రీయేసు
Verse
నా యతిక్రమములకై నలుగగొట్టబడి
నా దోషముల నీవు ప్రియముగను మోసితివా‖ సిలువలో ‖
Verse
నా రోగముల నీపై నమ్రతతో భరియించి
త్రుణీకరింపబడి ప్రాణమర్పించితివి‖ సిలువలో ‖
Verse
వ్యసనాక్రాంతుడవుగా వ్యాధిననుభవించి
మౌనము ధరించి మరణమైతివా ప్రభువా‖ సిలువలో ‖
Verse
పరమున కెత్తబడిన ప్రియ యేసురాకడకై
పదిలముగ కనిపెట్టి పాడెదను హల్లెలూయ‖ సిలువలో ‖

Related Tags

WorshipSacrificeJesus