Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Siluvalo Baliyaina Devuni Gorrepilla

సిలువలో బలియైన దేవుని గొర్రెపిల్ల

Siluvalo Baliyaina Devuni Gorrepilla

Chorus
సిలువలో బలియైన దేవుని గొర్రెపిల్ల
విలువైన నీ ప్రేమన్ వివరింతు శ్రీయేసు
Verse
ఆనాటి యూదులే నిన్ను జంపిరనుకొంటి
కాదు కాదయ్యయ్యో - నా పాప ఋణమునకే
Verse
నా యతిక్రమములకై - నలుగగొట్టబడి
నా దోషముల నీవు - ప్రియముగను మోసితివా
Verse
మృదువైన నీ నుదురు - ముండ్ల పోట్లచేత
సురూపము లేక - సోలిపోతివా ప్రియుడా
Verse
నా రోగముల నీపై నమ్రతతో భరియించి
తృణీకరింపబడి - ప్రాణమర్పించితివి
Verse
వ్యసనాక్రాంతుడవుగా - వ్యాధి ననుభవించి
మౌనము ధరించి - మరణమైతివా ప్రభువా
Verse
నా పాప దోషముచే - నే చచ్చి యుండగనే
మరణమై నాకొరకు - మరి తిరిగి లేచితివా
Verse
పరమున కెత్తబడిన - ప్రియ యేసురాకడకై
పదిలముగ కనిపెట్టి - పాడెదను హల్లెలూయ

Related Tags

Good FridaySacrificeAtonementJesus Christ