Verse
సిలువలో నాకై చేసిన యాగము
మరువలేనయ్యా మరచిపోనయ్యా
నీ ప్రేమను… నీ త్యాగము…
Chorus
మరువలేనయ్యా నీ ప్రేమను
మరచిపోనయ్యా నీ త్యాగము‖ 2x ‖
సిలువలో నాకై చేసిన యాగము‖ 2x మరువలేనయ్యా ‖
Verse
నా కోసమే నీవు జన్మించితివి
నా కోసమే నీవు సిలువనెక్కితివి‖ 2x ‖
నా కోసమే నీవు మరణించితివి‖ 2x ‖
నా కోసమే నీవు తిరిగి లేచితివి‖ 2x మరువలేనయ్యా ‖
Verse
ఎవరూ చూపని ప్రేమను చూపి
ఎవరూ చేయని త్యాగము చేసి‖ 2x ‖
విడువను ఎడబాయను అన్నావు‖ 2x ‖
నీ నిత్యజీవమును నాకివ్వగోరి‖ 2x మరువలేనయ్యా ‖