Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Siluvalo Nee Prema

సిలువలో నీ ప్రేమ

Siluvalo Nee Prema

Verse
సిలువలో నీ ప్రేమ – పాపము తీసేనయ్యా
మరణము చెరలో నుండి – నను విడిపించేనయ్యా‖ 2x ‖
ఘోర పాపిని నేను – పరిశుద్ధుని చేసితివి
నిత్యజీవములో నన్ను – నిలుపుటకు బలి అయితివి‖ 2x సిలువలో ‖
Verse
తాళలేని నీ తాపం – తొలగించెను నాదు శాపం
నలిగినట్టి నీ రూపం – ఇచ్చేను నాకు స్వరూపం‖ 2x ‖
నను విడిపించుటకు – విలువను విడిచితివి
పరమును చేర్చుటకు – మహిమను మరిచితివి‖ 2x ఘోర పాపిని ‖
Verse
దైవ తనయుని దేహం – మోసింది చేయని నేరం
కడిగేందుకు నా దోషం – చిందించె నిలువునా రుధిరం‖ 2x ‖
నను కాపాడుటకు – రొట్టెగా విరిగితివి
మరణము దాటుటకు – బలిగా మారితివి‖ 2x ఘోర పాపిని ‖
Verse
అధముడయినట్టి నేను – నీ ప్రేమ అర్హుడను కాను
పొగిడి నిన్ను ప్రతి క్షణము – తీర్చలేను నీ ఋణము‖ 2x ‖
నిను చాటించుటకు – వెలుగై సాగెదను
ప్రేమను పంచుటకై – ఉప్పుగ నిలిచెదను‖ 2x ఘోర పాపిని ‖

Related Tags

WorshipRepentanceGood FridaySacrifice